Header Banner

హరి హర వీరమల్లుకు ఆఫర్.. భారీగా టికెట్ రేట్ల పెంపు.. పవన్ కళ్యాణ్ సలహా మేరకే ఈ చర్యలు!

  Mon Jun 02, 2025 17:17        Politics

ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం తన భారీ చిత్రం 'హరిహర వీరమల్లు' విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల సవరణ, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి కోరుతూ అధికారికంగా అడుగులు వేశారు. ఈ మేరకు ఆయన నేడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు భరత్ భూషణ్‌ను కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఈ అభ్యర్థనను సరైన పద్ధతిలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

 

ఇది కూడా చదవండి: నోటీసులకు స్పందించని అమెరికా.. రాయితీలకు కోత విధించే యోచనలో భారత్!

 

ఈ నేపథ్యంలోనే నిర్మాత ఏఎం రత్నం ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించి తమ విజ్ఞప్తిని అందజేశారు. ఇటీవల థియేటర్ల మూసివేత కలకలం నేపథ్యంలో, పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఇదే సమయంలో టికెట్ రేట్ల పెంపు అంశంపై స్పందిస్తూ, నిర్మాతలు ఎవరికి వారుగా వచ్చి ప్రభుత్వాన్ని కలిసి టికెట్ రేట్ల పెంపును కోరడం కాకుండా, నిర్మాతలు ఫిలిం ఛాంబర్ ద్వారా టికెట్ రేట్ల ప్రతిపాదనలు పంపుకోవాలని సూచించారు. ఈ మేరకు నిర్మాత ఏఎం రత్నం ఫిలిం ఛాంబర్ ను సంప్రదించారు. హరిహర వీరమల్లు' చిత్రం భారీ బడ్జెట్‌తో, ఉన్నత సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో, టికెట్ ధరల విషయంలోనూ, అదనపు షోల ప్రదర్శనల విషయంలోనూ ముందస్తుగా అనుమతులు తీసుకోవడం ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాను ప్రదర్శించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఫిల్మ్ ఛాంబర్‌కు అందిన ఈ వినతి పత్రాన్ని వారు పరిశీలించి, తదుపరి చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంది. ఈ పరిణామంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

రేషన్ కార్డుదారులకు శుభవార్త..! మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన!

 

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య ..! మృతదేహాన్ని ముక్కలు చేసి బోరు బావిలో వేసి!

 

ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

 అమెరికాపై టెర్రర్ అటాక్! షాపింగ్ మాల్ లో..ఫైర్ బాంబులతో దాడి, పలువురికి గాయాలు!

 

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జూన్ 9 వరకు ఛాన్స్! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

 

తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ .. ఈ 2 పనులు చేశారా..! 5 రోజులే ఉందంట!

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

నేడు (2/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #HAriHaraMallu #TicketPrice #AMRatnam #FilmChamber